(Local) Sat, 24 Aug, 2019

పోలీసు కానిస్టేబుల్ పై బీజేపీ ఎంపీ దాడి

June 12, 2019,   12:09 PM IST
Share on:

ఎస్కార్టు డ్యూటీలో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ పై బీజేపీకి చెందిన మహిళా ఎంపీ దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. బీజేపీ మహిళా ఎంపీ రేఖావర్మ వద్ద పోలీసుకానిస్టేబుల్ శ్యాంసింగ్ ను ఎస్కార్టుగా నియమించారు.ఎంపీ రేఖావర్మ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పోలీసు కానిస్టేబుల్ శ్యాంసింగ్ భద్రతా విధులు నిర్వర్తించారు.ఎంపీ వద్ద భద్రతా విధులు నిర్వర్తించి తిరిగి వెళుతుండగా ఎంపీ రేఖావర్మ తనను పిలిచి అకారణంగా కొట్టారని పోలీసు కానిస్టేబుల్ శ్యాంసింగ్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.బీజేపీ మహిళా ఎంపీ తనపై చేయి చేసుకున్న ఘటనపై తనకు న్యాయం చేయాలని సీనియర్ పోలీసులను శ్యాంసింగ్ కోరారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.