(Local) Thu, 05 Dec, 2019

యోగా ఆధ్యాత్మిక సంస్థలు ఐకమత్యంగా ముందడుగు వేయాలి

November 16, 2019,   5:34 PM IST
Share on:
యోగా ఆధ్యాత్మిక సంస్థలు ఐకమత్యంగా ముందడుగు వేయాలి

మైసూరులో  కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ యోగ సదస్సులో శుక్రవారం ఆధ్యాత్మిక గురువు కమలేష్‌ పటేల్‌ ప్రసంగించారు. . 'ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలేష్‌ పటేల్‌ యోగా, ఆధ్యాత్మిక సంస్థలు కలిసిమెలిసి ఒక్కటిగా ముందడుగేయాలని, పరస్పరం చేరువ కావాలని పిలుపునిచ్చారు. పరస్పరం ప్రేమాభిమానాలను పంచుకోలేని పక్షంలో యోగా గురించి మాట్లాడటంలో అర్థం ఏముంది అంటూ దాజీ ఈ సందర్భంగా ప్రశ్నించినపుడు ఆహూతులు ఒక్కసారిగా లేచి నిలబడి కరతాళధ్వనులు చేశారు. దాజీ ప్రసంగంతో ఎంతో ఆనందానికి గురైన యోగా గురువు బాబా రాందేవ్‌ ఆప్యాయంగా ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ దఫా యోగాదినోత్సవాన్ని తాము హైదరాబాద్‌లోని 'హార్ట్‌పుల్‌నెన్‌' గ్లోబల్‌ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహిస్తామని రాందేవ్‌ చెప్పారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.