(Local) Fri, 06 Dec, 2019

ఆగస్టు 20 నాటికి చంద్రుని కక్ష లోకి చంద్రయాన్ 2...

August 13, 2019,   1:18 PM IST
Share on:
ఆగస్టు 20 నాటికి చంద్రుని కక్ష లోకి చంద్రయాన్ 2...

భారత అంతరిక్ష పరిశోధనలకు జాతిపిత గా గొప్పగుర్తింపు పొందిన డాక్టర్ విక్రమ్ శారాభాయి శత జయంతి ఉత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనడానికి శివన్ అహ్మదాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడారు. ఆగస్టు 20 నాటికి చంద్రుని కక్ష లోకి చంద్రయాన్2 చేరగలదని సెప్టెంబర్ 7న చంద్రునిపై దిగుతుందని ...రెండు రోజుల తరువాత చంద్రయాన్2 భూకక్షను విడిచిపెడుతుందని వివరించారు. జులై 22న చంద్రయాన్2ను ప్రయోగించిన తరువాత ఐదుసార్లు కక్ష అధిగమించే స్థాయిని పెంచగలిగామని, ఇప్పుడు అది భూకక్ష చుట్టూ పరిభ్రమిస్తోందని చెప్పారు. తరువాతి కక్ష అధిగమన స్థాయి పెంపు చాలా కీలకమైనది, ముఖ్యమైనది బుధవారం ఉదయం జరుగుతుంది. ఆరోజు ఆగస్టు 14 తెల్లవారు జాము 3.30 గంటల ప్రాంతంలో కక్ష అధిగమన స్థాయిని పెంచుతామని, దాన్ని ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ అని పిలుస్తారని తెలిపారు .

రానున్న నెలల్లో ఇస్రో చాలా బిజీగా ఉంటుందని, ముఖ్యంగా డిసెంబర్‌లో చిన్న శాటిలైట్లను ప్రయోగించే పనులను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ విధంగా చిన్నశాటిలైట్లను ప్రయోగించడానికి సన్నాహాలు చేయడం ఇదే మొదటిసారిగా ఆయన వివరించారు.

 

సంబంధిత వర్గం
ఇస్రో పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం సక్సెస్
ఇస్రో పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం సక్సెస్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.