(Local) Sun, 17 Nov, 2019

డేరా బాబా కేసులో హనీప్రీత్‌సింగ్‌కు బెయిలు

November 08, 2019,   12:54 PM IST
Share on:
డేరా బాబా కేసులో హనీప్రీత్‌సింగ్‌కు బెయిలు

ఆధ్యాత్మిక ముసుగులో ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేశారనే కేసులో ఆధ్యాత్మిక గురువు గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. అనంతరం అతడికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన అనుచరులు పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టించారు. ఈ అల్లర్లకు ప్రధాన సూత్రధారి హనీప్రీతేనని తేల్చిన పోలీసులు ఆమెను జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో 41 మందిని అరెస్టు చేసి అక్టోబర్‌ 2017లో అంబాలా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో బుధవారం డేరా బాబా అనుచరురాలు, పంచకుల అల్లర్ల కేసులో నిందితురాలైన హనీప్రీత్‌సింగ్‌కు హరియాణా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అక్టోబర్‌ 2017 నుంచి అంబాలా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆమె త్వరలో విడుదల కానున్నారు.

సంబంధిత వర్గం
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.