(Local) Thu, 05 Dec, 2019

డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట

November 16, 2019,   1:22 PM IST
Share on:
డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట

మనీలాండరింగ్‌ కేసులో గతనెలలో ఢిల్లీ హైకోర్టు కర్నాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌కు బెయిల్‌ మంజూరు చేసిన విషంయం తెలిసిందే. అయితే ఆయన ఈ కేసులో ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని బెయిల్‌ రద్దు చేయాలంటూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. మాజీ కేంద్రమంత్రి చిదంబరం కేసులో ఎలాంటి వాదనను వినిపించారో సరిగ్గా అలాంటి వాదననే ఏ విధమైన మార్పు లేకుండా వినిపిస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌లతో కూడిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెల్లడించింది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.