(Local) Mon, 09 Dec, 2019

మాజీ సీఎం లపై కేసు నమోదు

November 29, 2019,   3:31 PM IST
Share on:
మాజీ సీఎం లపై కేసు నమోదు

కర్ణాటక మాజీ సీఎం లు సిద్దరామయ్య, హెచ్ డీ కుమారస్వామిల  పై రాజద్రోహం,పరువు నష్టం కింద కేసు నమోదు అయినట్లు సమాచారం.లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆదాయం పన్ను శాఖ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారన్న కారణంగా కాంగ్రెస్, జేడీఎస్ నేతలపై ఈ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.

మాజీ సీఎం లతో పాటు సీనియర్ నేతలు డీకే శివకుమార్, పరమేశ్వర, దినేష్ గుండూరావు, సీనియర్ పోలీసు అధికారుల పేర్లు ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసినట్లు తెలుస్తుంది.జేడీ(ఎస్), కాంగ్రెస్ నేతల నివాసాలపై ఐటీ సిబ్బంది దాడులు జరపడానికి ముందే ఈ సమాచారాన్ని అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి లీక్ చేశారని మల్లికార్జున అనే స్వచ్ఛంద కార్యకర్త ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

గత మార్చి 27న ఐటీ కార్యాలయం ముందు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, మాజీ సీఎం సిద్ధరామయ్య, సంకీర్ణ కూటమిలోని మంత్రులు, అప్పటి అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఇతర ఎమ్మెల్యేలతో పాటు కుమారస్వామి ఈ నిరసనల్లో పాల్గొన్నారని, ఇది పూర్తిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని పిటీషన్ దారుడు తన ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి వారిపై కేసు నమోదు అవ్వడం తో ఈ కేసు విచారణ కు రానుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.