(Local) Mon, 16 Sep, 2019

ట్రాఫిక్ జరిమానాలు భారీగా తగ్గింపు

September 11, 2019,   11:03 AM IST
Views: 22
Share on:
ట్రాఫిక్ జరిమానాలు భారీగా తగ్గింపు

కొత్త మోటార్ వాహన చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ జరిమానాలను భారీగా తగ్గించి వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సామాన్యులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాలు నడిపితే రూ. వెయ్యి ఉన్న జరిమానాను 500కు తగ్గించింది. కాలుష్య కారక వాహనాలపై కూడా జరిమానా తగ్గించి ఉపశమనం కల్పించింది. చిన్న వాహనాలకు అయితే రూ. వెయ్యి, పెద్ద వాహనాలకు 3వేలు అని ప్రకటించింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ లేకుంటే తొలిసారి రూ.500 ఫైన్, రెండోసారి దొరికితే వెయ్యి, ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానాను రూ.వెయ్యి నుంచి 100కు తగ్గించింది.

సంబంధిత వర్గం
చెప్పులు వేసుకుని బైక్ నడిపే వారికి షాకింగ్ న్యూస్ ...
చెప్పులు వేసుకుని బైక్ నడిపే వారికి షాకింగ్ న్యూస్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.