(Local) Mon, 20 Jan, 2020

రేషన్ కార్డు పోయిందా..? రూ.20 ఇస్తే చాలు..!

September 11, 2019,   2:50 PM IST
Share on:
రేషన్ కార్డు పోయిందా..? రూ.20 ఇస్తే చాలు..!

రేషన్‌ కార్డు పోగొట్టు కున్నవారికి రూ.20 రుసుముతో ప్రత్యామ్నాయ కార్డును అందించే సేవలను ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. రాష్ట్ర రేషన్‌ దుకాణాల్లో రాయితీ ధరకు ఆహార వస్తువులు అందిస్తున్నారు. వీటి కొనుగోలుకు ఆహారసరఫరా శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేసింది. ఈ కార్డు పోగొట్టుకున్నవారు, ఇదివరకే ఉన్న కార్డులో సవరణలు చేయదలచుకున్నవారు ప్రభుత్వ ఈ-సేవా కేంద్రాల్లో రూ.30 చెల్లించి వేరే కార్డులను పొందుతున్నారు. అయితే సేవా కేంద్ర ఉద్యోగులు అధిక రుసుము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో 2018 నుంచి ప్రత్యామ్న్యాయ కార్డులు అందజేయాటం నిలిపివేశారు. కార్డులు పోగొట్టుకున్న పలువురు తమకు కార్డులు అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో రూ.20 రుసుముతో ప్రత్యామ్నాయ కార్డులను అందజేయడాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈ సేవలు ఇప్పటివరకైతే, తమిళనాడులో ప్రాథమికంగా ప్రవేశపెట్టనున్నారు.

సంబంధిత వర్గం
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?
సైబర్ దాడుల నుంచి మనం సురక్షితంగా ఉన్నామా?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.