(Local) Fri, 22 Nov, 2019

భారత్‌తో చైనా ఎప్పటికీ మెరుగైన సంబంధాల్నే కోరుకుంటోంది

October 21, 2019,   2:09 PM IST
Share on:
భారత్‌తో చైనా ఎప్పటికీ మెరుగైన సంబంధాల్నే కోరుకుంట ...

ఇండియాలోని చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌  ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత్‌-చైనా ఇరు దేశాలు తమ పరస్పర ప్రయోజనాలపై దృష్టి సారిస్తూ సమయానుసారంగా కీలకాంశాలసై వ్యూహాత్మక చర్చలు కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే ప్రస్తుతం ఉభయ దేశాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య జరిగిన భేటీలో ఈ అంశాలు చర్చకు వచ్చాయన్నారు. విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలన్న మోదీ పిలుపును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత్‌తో చైనా ఎప్పటికీ మెరుగైన సంబంధాల్నే కోరుకుంటోందన్నారు. అదే సమయంలో భారత్‌-పాకిస్తాన్‌, చైనా-పాకిస్టాన్‌ సంబంధాలు కూడా బలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.