(Local) Wed, 16 Oct, 2019

భారత్ చేతిలో స్విస్ ఖాతాల వివరాలు

October 07, 2019,   10:38 PM IST
Share on:
భారత్ చేతిలో స్విస్ ఖాతాల వివరాలు

బ్లాక్ మనీ వెలికితీసే ప్రకియలో భాగంగా భారత్ భారీ ముందడుగు వేసింది. విదేశాల్లో దాగిన నల్ల కుబేరుల జాబితాను సంపాదించింది. భారత్ తో పాటు 75 దేశాలు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ టీఏ) నుంచి ఇలాంటి వివరాలు పొందుతాయని ఎఫ్ టీఏ ప్రతినిధి వెల్లడించారు. ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రేమ్ వర్క్ కింద స్విట్జర్లాండ్ నుంచి భారత్ తమ ఖాతాదారుల సమాచారాన్ని తెలుసుకోవడం ఇదే తొలిసారి.2018లో స్విస్ బ్యాంకుల్లో చురుకుగా ఉన్న ఇండియన్స్ ఖాతాలు, మూసివేసిన ఖాతాల వివరాలను పొందుపరిచారు. 2020 సెప్టెంబరులో తదుపరి సమాచార మార్పిడి ఉండబోతుంది. ఎఫ్‌టీఏ మొత్తం 75 దేశాలకు చెందిన 31 లక్షల ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా దేశాలతో పంచుకోగా, వారి నుంచి 24 లక్షల ఖాతాల సమాచారాన్ని సేకరించింది. ఈ డేటాలో బ్యాంకు ఖాతాదారు పేరు, ఖాతా సంఖ్యతో పాటు ఖాతాదారుని అడ్రస్‌, చిరునామా, పన్ను గుర్తింపు సంఖ్య సహా బ్యాంకు, ఆర్థిక సంస్థ పేరు ఖాతాదారు ఖాతాలో ఉన్న నిధుల వివరాలు, క్యాపిటల్‌ ఇన్‌కమ్‌ వంటి పలు వివరాలు ఉంటాయి.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.