(Local) Sun, 17 Nov, 2019

ఉగ్రవాదంతో శాంతిభద్రతలకు విఘాతం:కిషన్‌ రెడ్డి

November 08, 2019,   8:09 PM IST
Share on:
ఉగ్రవాదంతో శాంతిభద్రతలకు విఘాతం:కిషన్‌ రెడ్డి

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద నిధుల కట్టడి సదస్సులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి  ప్రసంగించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి ఉగ్రవాదాన్ని శాంతి-భద్రతలు, అభివృద్ధికి పొంచి ఉన్న అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై, దానికి అండగా నిలుస్తున్నవారిపై ఉమ్మడిగా పోరాడదామంటూ ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఎంత మాత్రం సహించకూడదన్నారు. కొన్ని దేశాలు ముష్కరులకు మద్దతుగా నిలుస్తున్నాయంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదంపై పోరులో రాజకీయాలకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఐరాస నేతృత్వంలో సమగ్ర సమావేశం నిర్వహించడంలో అన్ని దేశాలు చొరవ చూపాలని కోరారు. వచ్చే ఏడాది ఉగ్రవాద నిధుల కట్టడి సదస్సును భారత్‌లో నిర్వహించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత వర్గం
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.