(Local) Thu, 18 Jul, 2019

కమల్ కి అళగిరి మద్దతు

May 14, 2019,   1:44 PM IST
Share on:

 

తమిళనాడులో జరిగుతున్న ఒక ఎమ్మెల్యే స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. దేశంలో తొలి ఉగ్రవాది ఓ హిందువు అని పేర్కొన్న కమల్, జాతిపిత గాంధీని చంపిన నాథూరాం గాడ్సేనే ఆ ఉగ్రవాది అని ఆయన ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యల పట్ల  బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, కమల్ కు సొంతరాష్ట్రం నుంచి మద్దతు లభించింది.తమిళనాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ కేఎస్ అళగిరి మాట్లాడుతూ కమల్ వ్యాఖ్యలతో తాను నూటికి నూరు శాతం కాదు 1000 శాతం ఏకీభవిస్తున్నానని, కమల్ అన్నదాంట్లో తప్పేమీలేదని అన్నారు. అరబ్ దేశాల్లో ఐఎస్ఐఎస్ సంస్థ తమ సిద్ధాంతాలను వ్యతిరేకించేవారిని అంతమొందించాలని భావిస్తుందని, భారత్ లో కూడా ఆర్ఎస్ఎస్, జనసంఘ్, హిందూ మహాసభలు ఆ విధంగానే తయారయ్యాయని అళగిరి విమర్శించారు. ఈ క్రమంలోనే ఆరెస్సెస్ కు, ఐసిస్ కు పెద్ద తేడా లేదని, ఈ రెండు సంస్థలు ఒక్క విధంగానే వ్యవహరిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిని విపరీతంగా ద్వేషిస్తూ ఆర్ఎస్ఎస్ ఓ ఉగ్రవాద సంస్థను తలపిస్తోందని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.