(Local) Fri, 22 Nov, 2019

మహారాష్ట్రలో కలకలం, అభ్యర్థిపై కాల్పులు

October 21, 2019,   4:46 PM IST
Share on:
మహారాష్ట్రలో కలకలం, అభ్యర్థిపై కాల్పులు

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ కలకలం రేగింది. అమరావతి జిల్లాలో ఈ హింసాత్మక ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయానికి గురయ్యారు. కాంగ్రెస్ మిత్ర పక్షమైన స్వాభిమాని పక్ష పార్టీకి చెందిన దేవంద్ర భుయార్ తాజా ఎన్నికల్లో మోర్షి నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్నారు. సోమవారం ఉదయం ఓటు వేసేందుకు కార్యకర్తలతో కలిసి వస్తుండగా బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న భుయార్ వాహనానికి నిప్పంటించి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భుయార్ ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.