(Local) Fri, 13 Dec, 2019

గవర్నర్‌కు హెలికాప్టర్‌ తిరస్కరించిన మమతా బెనర్జీ..!!!  

November 16, 2019,   12:30 PM IST
Share on:
గవర్నర్‌కు హెలికాప్టర్‌ తిరస్కరించిన మమతా బెనర్జీ. ...

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్‌కు మరోసారి ఝలక్‌ ఇచ్చారు. ముర్షిదాబాద్‌లో శుక్రవారం నిర్వహించే ప్రొఫెసర్‌ ఎస్‌ఎన్‌హెచ్‌ కాలేజీ రజతోత్సవ కార్యక్రమానికి గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌ ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉండగా, ఇందుకోసం హెలికాప్టర్‌ సమకూర్చాలని సీఎంకు ఆయన కార్యాలయం విజ్ఞప్తి చేసింది. కానీ ఆ విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారని గవర్నర్‌ కార్యాలయం తెలిపింది. దీంతో 600 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలని గవర్నర్‌ నిర్ణయించుకున్నారు. ఆయనకు ఇలా జరగడం ఇది రెండోసారి. కాగా, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు బీజేపీ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజా సంఘటన చర్చనీయాంశమైంది.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.