(Local) Wed, 16 Oct, 2019

ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ఎంపీ ఫైర్!

October 08, 2019,   10:42 AM IST
Share on:
ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ఎంపీ ఫైర్!

ఎన్సీపీ రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్ ఎయిర్ ఇండియా విమానంలో పూణే నుంచి న్యూఢిల్లీకి బయలుదేరారు. ఆమె విమానంలో ఆమ్లెట్ కావాలని కోరగా, ఆమ్లెట్ తో పాటు కోడి గుడ్డు పెంకులు కూడా వచ్చాయి. దీంతో పాటు వడ్డించిన కూరలో ఉడకని బంగాళాదుంపలు, బీన్స్ కూడా రావడంతో ఆమె ఎయిరిండియాపై ఫైర్ అయ్యారు.
జరిగిన ఘటనను తన సోషల్ మీడియా ఖాతాలో వందనా చవాన్ వెల్లడించారు. ఆర్డర్ ఇచ్చిన ఆమ్లెట్ లో గుడ్డు పెంకులు కూడా వచ్చాయని ఫిర్యాదు చేస్తూ, పౌరవిమానయాన శాఖ మంత్రి హరదీప్ పూరితో పాటు నరేంద్రమోదీ, ఎయిరిండియా సీఎండీ, పౌర విమానయాన శాఖ డైరెక్టరు జనరల్ లను ట్యాగ్ చేశారు. వడ్డించిన కూర కూడా తినేలా లేదని ఆరోపించారు. ఈ విషయంపై ఎయిరిండియా స్పందించింది. కేటరింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూస్తామని సంస్థ ప్రతినిధి ధనుంజయ్ కుమార్ చెప్పారు.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.