(Local) Sun, 31 May, 2020

శతాబ్ది రైల్లో ఇక అరలీటరు నీరే!

November 08, 2019,   1:21 PM IST
Share on:
శతాబ్ది రైల్లో ఇక అరలీటరు నీరే!

రైళ్లల్లో నీటి వృథాను అరికట్టే ప్రయత్నంలో భాగంగా శతాబ్ది రైళ్లలో ప్రయాణించేవారికి ఒక లీటరు ‘రైల్‌నీర్‌’ నీటి సీసాల బదులు అరలీటరు నీటి సీసాలను ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 8.5 గంటల్లోపు ప్రయాణం చేసే శతాబ్ది రైళ్లలో ఇకపై ఒక లీటర్‌ నీటి సీసాలను ఇవ్వవద్దని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం శతాబ్ది రైల్లో 5 గంటల ప్రయాణం చేసే వారికి అరలీటరు సీసాలను, అంతకంటే ఎక్కువ సేపు ప్రయాణం చేసేవారికి ఒక లీటరు నీటి సీసాలను అందిస్తున్నారు. నూతన ఆదేశాల ప్రకారం ప్రయాణికులు అడిగితే అదనపు సీసాలు ఇస్తామని, అయితే వాటికి నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.