(Local) Mon, 21 Oct, 2019

ఒకే దేశం ఒకే భాషా ఉండకూడదు -జైరాంరమేష్‌

September 16, 2019,   4:17 PM IST
Share on:
ఒకే దేశం ఒకే భాషా ఉండకూడదు -జైరాంరమేష్‌

ఒకే దేశం ఒకే పన్ను విధానం వుండవచ్చు. కాని ఒకే దేశం ఒకే భాషా అన్నది ఉండకూడదని కాంగ్రెస్‌ నేత జైరాంరమేష్‌  అన్నారు. విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా కర్ణాటక ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మారక ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పాటు గవర్నర్‌ వాజుభాయ్ వాలా కూడా హాజరయ్యారు.

కేంద్ర మంత్రి అమిత్‌షా హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. మనకు ఒకే దేశం -ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండవచ్చు, కానీ ఒకే దేశం – ఒకే సంస్కృతి, ఒకే దేశం ఒకే భాష ఉండవంటూ జైరాం రమేష్‌ అంటూ కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్‌ షా హిందీని జాతీయ భాషగా చేయాలనే ఆలోచనతో ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష దేశం మొత్తాన్ని ఒకటి చేస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ఢిల్లీ చేరుకున్న జగన్
ఢిల్లీ చేరుకున్న జగన్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.