(Local) Wed, 16 Oct, 2019

హర్యానాలో ప్రధాని మోడీ ప్రచార ర్యాలీలు

October 08, 2019,   11:47 AM IST
Share on:
హర్యానాలో ప్రధాని మోడీ ప్రచార ర్యాలీలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బిజెపికి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇక్కడ బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ ఈసారి 75 కన్నా ఎక్కువ స్థానాలు సాధించుకోవాలన్న పట్టుదలతో కేంద్ర కమలనాధులు ముమ్మరంగా ప్రచారం సాగించడానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 21 న ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్రమోడీ ప్రచారం సాగించనున్నారు. ఫరీదాబాద్ జిల్లా బల్లభ్ గఢ్‌లో 14 న మొదటి ప్రచార ర్యాలీలో పాల్గొంటారు. 15న దాద్రి, థనేసర్, హిసార్‌ల్లో మూడు ర్యాలీల్లో పాల్గొంటారు. కామన్వెల్తు క్రీడల పతక గ్రహీత బబితా ఫోగట్‌ను దాద్రి నుంచి పోటీకి బిజెపి నిలబెట్టింది.ఇదిలా ఉండగా మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్, తదితర అగ్రనేతలు కూడా ప్రచార రంగంలో దిగుతున్నారు. ఈనెల 9న కైతల్, హిసార్, భివానీ, రోహతక్ జిల్లాల్లో 14న ఫతేహాబాద్,పంచ్‌కుల, కర్నల్ గుర్‌గావ్ జిల్లాల్లో అమిత్‌షా ప్రచార ర్యాలీల్లో పాల్గొంటారు. 11న శిర్సా, గుర్‌గావ్ జిల్లాల్లో నడ్డాతోపాటు ఆదిత్యనాధ్ కూడా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా, 48 స్థానాల్లో బిజెపి సభ్యులు ఉన్నారు. ఈసారి 75కు మించి స్థానాలను సాధించాలన్న పట్టుదలతో కమలనాధులు ఉన్నారు.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.