(Local) Mon, 21 Oct, 2019

పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కి దిగిన నరేంద్ర మోదీ సోదరుడు

May 15, 2019,   1:47 PM IST
Share on:
పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కి దిగిన నరేంద్ర మోదీ స ...

 

వ్యక్తిగత భద్రతాసిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్‌ మోదీ ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.  జైపూర్‌ - అజ్మేర్‌ జాతీయ రహదారి మార్గంలోని బగ్రు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం  ప్రహ్లాద్‌ మోదీకి ఇద్దరు పీఎస్‌వోలను కేటాయించింది. నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రహ్లాద్‌ తో పాటు ఒకే వాహనంలో వెళ్లాలి. అయితే ఇందుకు ఆయన అంగీకరించలేదు. భద్రతా సిబ్బందిని తన వాహనంలో తీసుకెళ్లడం కుదరదని వారికి ప్రత్యేక పోలీస్‌ వాహనం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

అయితే అలాంటి ఏర్పాట్లు ఏమీ చేయకపోవడంతో ఆయన పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దాదాపు గంట పాటు ప్రహ్లాద్‌ ఆందోళన సాగింది. అనంతరం పోలీసులు సర్దిచెప్పడంతో ప్రహ్లాద్‌ మోదీ భద్రతా సిబ్బందిని వెంట తీసుకుని వెళ్లిపోయారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.