(Local) Mon, 21 Oct, 2019

సూపర్ ఎమర్జన్సీ శకంలో ఉన్నాం: మమతా బెనర్జీ

September 16, 2019,   11:21 AM IST
Share on:
సూపర్ ఎమర్జన్సీ శకంలో ఉన్నాం: మమతా బెనర్జీ

అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మోదీ సర్కార్‌పై తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేసారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  . బీజేపీ పేరు ఎత్తకుండానే సూపర్ ఎమర్జన్సీ శకంలో ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. ఏ రాజ్యాంగ పునాదులపై ఈ దేశం నిర్మాణం జరిగిందో, వాటిని రక్షిస్తామని మరోసారి ప్రతిజ్ఞ చేయాలంటూ ట్వీట్ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీపై ఎప్పటికప్పుడు నిప్పులు చిమ్ముతున్న దీదీ, తాజాగా అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సూపర్ ఎమర్జన్సీ శకమని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వర్గం
గంగూలీ ని మెచ్చకున్న మమతా
గంగూలీ ని మెచ్చకున్న మమతా
మమతపై హత్యాయత్నం, 29 ఏళ్ల తర్వాత విముక్తి
మమతపై హత్యాయత్నం, 29 ఏళ్ల తర్వాత విముక్తి

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.