(Local) Wed, 16 Oct, 2019

నేడు పారిస్‌లో రాఫెల్ కి ఆయుధ పూజ

October 08, 2019,   11:44 AM IST
Share on:
నేడు పారిస్‌లో రాఫెల్ కి ఆయుధ పూజ

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం పారిస్‌లో తొలి రాఫెల్ యద్ధ విమానాన్ని స్వీకరిస్తారు. భారతదేశ వైమానిక బలగాలకు మరింత రక్షణ పాటవాన్ని కల్పించే రాఫెల్‌ను అధికారికంగా స్వీకరించేందుకు రక్షణ మంత్రి పారిస్ చేరుకున్నారు. మంగళవారం విజయదశమి, భారతీయ వైమానిక దళం (IAF) వ్యవస్థాపక దినోత్సవం కూడా ఉండటంతో తొలి రాఫెల్ స్వీకరణకు ప్రత్యేకత ఏర్పడింది. పలు వివాదాలు, కొనుగోళ్ల వ్యవహారాలలో ఆరోపణల నడుమనే 36 రాఫెల్ విమానాల వరుసలో తొలి విమానాన్ని లాంఛనంగా రక్షణ మంత్రి ఫ్రాన్స్ బృందం నుంచి మెరిగ్నాక్ వైమానిక స్థావరంలో అందుకుంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం రాఫెల్‌కు ఆయుధ పూజాదికాలు కూడా నిర్వహిస్తారు. బోర్డియాక్స్‌లోని వైమానిక స్థావరానికి వెళ్లేముందు రక్షణ మంత్రి ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌తో సమావేశం అవుతారు. విస్తృత స్థాయిలో కీలక అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తాయని భావిస్తున్నారు.
వైమానిక స్థావరంలో రక్షణ మంత్రి స్వీకరించే రాఫెల్‌కు టెయిల్ నెంబరు ఆర్‌బి 101 ని పొందుపర్చారు. ప్రస్తుత విమానదళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కెఎస్ భదౌరియా పొడి పేరు దృష్టిలో పెట్టుకుని ఆర్‌బి పేరు పెట్టారు. రాఫెల్ ఒప్పందం కుదరడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పటికీ రాఫెల్ విమానం నడపడంలో భారతీయ పైలెట్లు శిక్షణ పొందుతున్నందున తొలి రాఫెల్‌కు ఫ్రెంచ్ పైలెటే ఛోదకుడిగా ఉంటారు.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.