(Local) Sun, 08 Dec, 2019

కాంగ్రెస్‌ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాలి - అమిత్ షా

November 15, 2019,   10:38 AM IST
Share on:
కాంగ్రెస్‌ పార్టీ దేశానికి క్షమాపణలు చెప్పాలి - అమ ...

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన  తీర్పు సందర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రాఫెల్‌పై అసత్య ప్రచారాలు చేసిన నేతలకు, పార్టీలకు ఇది దిమ్మతిరిగిపోయే జవాబు అని  ఆయన అన్నారు. జాతి ప్రయోజనాలను పక్కన పెట్టి రాఫెల్‌ ఒప్పందంపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ, ఆపార్టీ నేతలు దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అవినీతి రహిత పాలనకు, పారదర్శకతకు మోది ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సుప్రీం తీర్పుతో మరోసారి రుజువైందని చెప్పారు. ఈ అంశంపై అనవసరంగా పార్లమెంట్‌ సమయాన్ని వృథా చేశారని, ఇకనుండి ప్రజా ప్రయోజనాల కోసమే ఉపయోగించాల్సిన టైం వచ్చిందని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.