(Local) Wed, 16 Oct, 2019

నెలరోజుల జీతాన్ని విరాళంగా ఇచ్చిన మాజీ సీఎం

September 16, 2019,   1:11 PM IST
Share on:
నెలరోజుల జీతాన్ని విరాళంగా ఇచ్చిన మాజీ సీఎం

బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌ జిల్లాలో వరద బాధితుల సహాయార్ధం తన నెల రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ మాండసౌర్‌లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయని, ప్రజాజీవనానికి తీవ్ర అంతరాయం కలిగిందని అన్నారు. వరద బాధితుల కోసం తన వంతుగా నెలరోజుల వేతనం విరాళంగా ఇస్తున్నానని, ప్రజలు సైతం తమ వంతుగా ఆహారం, బట్టలు, డబ్బు ఇలా తమకు తోచినది విరాళంగా ఇచ్చి ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత మూడు రోజులుగా జిల్లాలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. ఇందిరా గాంధీ జిల్లా ఆసుపత్రిలోకి కూడా నీరు వచ్చి చేరింది. మరి కొద్ది రోజులకు కానీ నీటిమట్టం తగ్గే అవకాశం లేదని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాగం జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించింది. కాగా, వరదల కారణంగా ప్రాణనష్టంపై ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు.

సంబంధిత వర్గం
బీజేపీ  నేతను  తుపాకులతో కాల్చిన దుండగులు
బీజేపీ నేతను తుపాకులతో కాల్చిన దుండగులు
తెలంగాణ మంత్రుల కాన్వాయ్ ను అడ్డుకున్న కొండగట్టు బ ...
తెలంగాణ మంత్రుల కాన్వాయ్ ను అడ్డుకున్న కొండగట్టు బ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.