(Local) Fri, 15 Nov, 2019

స్పెషల్ స్టోరీ : అమరవీరులకు జోహార్లు....పోలీసు స్మారక దినం

October 21, 2019,   10:48 AM IST
Share on:
స్పెషల్ స్టోరీ : అమరవీరులకు జోహార్లు....పోలీసు స్మ ...

అందరు పడుకున్నా తాను మాత్రం అందరికి రక్షణగా మేల్కొని ఉంటాడు. మనం పండుగలు చేసుకుంటున్న తాను మాత్రం కుటుంబానికి దూరంగా పండుగకి రక్షణగా నిలుస్తాడు. ప్రజల ప్రాణాలు పోతుంటే తాను మాత్రం ప్రాణాలు సైతం పణంగా పెట్టి ప్రజలకు రక్షణగా నిలబడతాడు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే తాను మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలకోసం వాళ్ళ ప్రాణాలను సైతం వదులుతున్న వారే మన ''పోలీసులు''. నేడు పోలీసు అమర వీరుల దినోత్సవం. ఇప్పటికే చాల మంది పోలీసులు ప్రజల కోసం ప్రాణాలు విడిచారు. వారు ప్రజల కోసం చేసిన త్యాగానికి వారికి గౌరవం ఇవ్వడం మనందరి భాద్యత. పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు 'అమర వీరుల సంస్మరణ దినం' జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశం.

1959 చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా తిప్పిగొట్టిన రోజు ఈరోజే. అందుకే అక్టోబర్‌ 21 న పోలీసు అమరవీరుల దినంగా భావిస్తాం. ఈ పోరాటంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారు. ఆ త్యాగాలను మనం గుర్తించుకుందాం. వారిని గౌరవిద్దాం.
పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్నది. ఇతర ఉద్యోగంలో ఉన్నదానికంటే కొంచెం కఠినంగా ఉంటుంది. ఏ నిమిషాన ఏ పరిస్థితి వస్తుందో వారికే తెలియదు. కానీ సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి వచ్చేస్తారు. వారిది 24 గంటల ఉద్యోగం. ప్రతి ఒక్కరు ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనే. దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. శాంతిభద్రతలను అదుపులో పెట్టడం, నేరగాళ్ళను నియంత్రించడం పోలీసుల కర్తవ్యం. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు.
వీరికి పని వత్తిడి చాల ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోలీసులు అందరినీ పరిగణనలోకి తీసుకొంటే 80 శాతం మంది తలనొప్పి, బీపీ, మధుమేహం, మెడ, వెన్నునొప్పి ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

లంచం తీసుకునే పోలీసులు ఉన్నారు. ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని పోలీసులు ఉన్నారు. లంచం తీసుకునేవాడు కనిపిస్తాడు. ప్రజల కోసం పోరాడేవాడు ప్రాణ త్యాగం చేసి అమరులవుతున్నారు. నిద్ర పోయి పని చేస్తున్నవారు ఉన్నారు. వారిని మనం గుర్తుపెట్టుకుంటాం. నిద్రాహారాలు మాని డ్యూటీలు చేసే పోలీసులు ఉన్నారు. వారిని మాత్రం మనం గమనించం. చాల మంది మన దగ్గర లంచం తీసుకుంటే మనం వారిని తిడతాం. కానీ ప్రజలకోసం చేసేవాడు అధికారులతో తిట్లు తిన్నా ఇంకా ప్రజలకు ఎదో చేయాలని ముందుకు వస్తాడు. వందమందిలో ఒక్కడు లంచం తీసుకుంటే 99 మంది ప్రజలకోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి అవినీతి నుంచి కాపాడే విధంగా అడుగులేస్తున్నారు. అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య సమాజానికి ఇంత సేవ చేస్తున్న పోలీసులను గౌరవించడం మనందరి బాధ్యత. వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం.

సంబంధిత వర్గం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం
హెచ్‌టీటీ-40 విమానయానం అద్భుతం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.