(Local) Thu, 24 Sep, 2020

డబ్బులు వదిలేసి… ఉల్లిపాయల బస్తాలు చోరీ

November 29, 2019,   12:33 PM IST
Share on:
డబ్బులు వదిలేసి… ఉల్లిపాయల బస్తాలు చోరీ

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో దొంగలు తెలివిగా వ్యవహరిస్తున్నారు. అర్థరాత్రి ఓ షాపులో చోరీకి పాల్పడిన దొంగలు బాక్స్ లోని నగదును పట్టించుకోకుండా.. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి బస్తాలను ఎత్తుకెళ్లిపోయారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో సుతహత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

అక్షయ్‌ దాస్‌ అనే వ్యక్తి కూరగాయాల దుకాణం నిర్వహిస్తున్నాడు. తాజాగా ఉల్లిధరలు భగ్గుమంటుండటంతో ఎక్కువ దిగుమతి చేసుకుని నిల్వ ఉంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆయన షాపులో ఉల్లిపాయ బస్తాలు, వెల్లుల్లి, అల్లం బస్తాలు మాయమయ్యాయి. మంగళవారం షాపు తెరచి చూసి అక్షయ్ దాస్ కు వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి క్యాష్‌ బాక్స్‌ దగ్గరికి వెళ్లి చూడగా అందులో నగదు మొత్తం అలానే ఉంది. కానీ ఉల్లిపాయల బస్తాలు చోరీ అయ్యాయి. ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.