(Local) Thu, 28 May, 2020

హిందియా కాదు..ఇండియా - స్టాలిన్

September 15, 2019,   1:27 PM IST
Share on:
హిందియా కాదు..ఇండియా -  స్టాలిన్

ఒక జాతి, ఒక భాష అంటూ హిందీని దేశ ప్రజలంతా ఆదరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుపై దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకలు తీవ్రంగా స్పందించారు. ఇది హిందియా కాదు..ఇండియా అంటూ డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ అమిత్ షాపై మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు. హోం మంత్రి అమిత్ షా హిందీ దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు భారతదేశ సమగ్రతకు ముప్పు తెచ్చే విధంగా ఉన్నాయని, వీటిని ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. హిందీ ప్రాబల్యం కారణంగా తమ హక్కులను కోల్పోయే రాష్ట్రాలను సంఘటిత పరచడానికి డిఎంకె వెనుకాడబోదని ఆయన తెలిపారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ వివరణ ఇచ్చేవరకు ఈ భాషా యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని స్టాలిన్ హెచ్చరించారు.

సంబంధిత వర్గం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం
అమిత్ షాతో తెలుగుదేశం ఎంపీల సమావేశం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.