(Local) Sat, 24 Aug, 2019

ఉత్తరప్రదేశ్ జర్నలిస్టు అరెస్టును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

June 12, 2019,   1:01 PM IST
Share on:

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ చేసిన వ్యవహారంలో ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇది హత్య కేసు కాదని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.ప్రశాంత్ కనోజియా ఇటీవల తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. సిఎం కార్యాలయం ఎదుట ఒక మహిళ మీడియాతో మాట్లాడుతూ సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు తాను పెళ్లి ప్రతిపాదన పంపానని చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోపై ఆగ్ర హం చెందిన కొందరు ప్రశాంత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం రాత్రి కనోజియాను అరెస్టు చేశా రు. అయితే ఈ అరెస్టును సవాలు చేస్తూ కనోజియా భార్య జగీశా అరోరా సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి అరెస్టు వారెంట్ జారీ చేయకుండానే తన భర్తను పోలీసులు తీసుకెళ్లారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. జగీశా అభ్యర్థనపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు యుపి పోలీసుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.ఇదేమీ హత్య కేసు కాదని, జర్నలిస్టుకు బెయి లు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. కనోజియాను తక్షణం విడుదల చేయాలని యుపి పోలీసులను ఆదేశించింది.

కోర్టు తీర్పు నా విశ్వాసాన్ని నిలిపింది: జగీశా
కాగా, సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగం పట్ల తన విశ్వాసాన్ని మరో సారి నిలబెట్టిందని కనోజియా భార్య జగీశా అరోరా వ్యాఖ్యానిం చారు. యుపి పోలీసులు మితిమీరి ప్రవర్తించారని కూడా కోర్టు వ్యాఖ్యానించిందని ఆమె అన్నారు. కాగా కనోజియా సోషల్ మీడి యాలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉంచిన వీడియో గురించి విలేఖరులు ప్రశ్నించగా, అందులో అభ్యంతరకరమైంది ఏమీ లేదని తాను అనుకొంటున్నానని ఆమె చెప్పారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.