(Local) Mon, 21 Oct, 2019

‘అస్సాం రెజిమెంట్’ పాటకు చిందేసిన అమెరికా-భారత సైన్యాలు..

September 16, 2019,   12:07 PM IST
Share on:
‘అస్సాం రెజిమెంట్’ పాటకు చిందేసిన అమెరికా-భారత సైన ...

అగ్రరాజ్యం అమెరికా, భారత్ లు ‘యుద్ధ అభ్యాస్’ పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో లూయిస్-మెక్ఛోర్డ్ ఆర్మీ బేస్ లో ఈ నెల 5 నుంచి 18 వరకూ సైనిక విన్యాసాలు సాగుతాయి. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేత, ల్యాండ్ మైన్ల గుర్తింపు, ఉగ్రచెర నుంచి ప్రజలను కాపాడటానికి సంబంధించి ప్రత్యేక శిక్షణను చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన వీడియో వెలుగులోకి వచ్చింది.
శిక్షణా సమయం పూర్తయ్యాక అమెరికా-భారత సైనికులు కలిసి అస్సాం రెజిమెంట్ మార్చింగ్ సాంగ్ ‘బద్లూరామ్ కా బంధన్ జమీన్ కే నీచే హై’ను అద్భుతంగా పాడారు. ఈ పాటలు చప్పట్లు కొడుతూ, కాళ్లను లయబద్ధంగా కదలిస్తూ ఎంజాయ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇరుదేశాల సైనికులు ఈ పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

https://twitter.com/ANI/status/1173122309080723457

సంబంధిత వర్గం
భారత ఆర్మీ దాడులపై ..పాక్ పత్రికల కథనాలు
భారత ఆర్మీ దాడులపై ..పాక్ పత్రికల కథనాలు
ప్రాణాలకు తెగించి 20 మంది పిల్లల్ని కాపాడిన భారత ఆ ...
ప్రాణాలకు తెగించి 20 మంది పిల్లల్ని కాపాడిన భారత ఆ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.