(Local) Thu, 04 Jun, 2020

యుపి డిజిపి, ప్రభుత్వానికి, ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

May 14, 2019,   2:19 PM IST
Share on:
యుపి డిజిపి, ప్రభుత్వానికి, ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసుల ...

ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌ బాబూఘర్‌లో దారుణం చోటు చేసుకుంది.ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. తండ్రి, ఆమె బంధువులు కలిసి మహిళను విక్రయించ‌డం జ‌రిగింది. అయితే బాధితులరాలిని కొనుగోలు చేసిన వ్యక్తి ఆమెను పలు ఇళ్లలో పనిమనిషిగా చేర్చాడు. దీంతో ఆమెపై పలుమార్లు సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులకు ఫిర్య‌దు చేసినా వారు పట్టించుకోక‌పోవ‌డంతో బాధితురాలు నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఘటనపై మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్ సియం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వ‌చ్చింది. అయితే బాధితురాలి ఆత్యహత్యాయత్నం ఘటనలపై తాజాగా ఎన్‌హెచ్‌ఆర్సీ సోమవారం స్పందించింది. యూపి డిజిపి, ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లోగా వివరాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని , డిజిపిని ఆదేశించింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.