(Local) Thu, 18 Jul, 2019

నేడు అయోధ్యలో శివసేన ఎంపీల పర్యటన

June 16, 2019,   4:22 PM IST
Share on:

శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే తమ పార్టీకి చెందిన 18మంది ఎంపీలతో కలిసి నేడు అయోధ్యలో పర్యటించనున్నారు.ఉద్దవ్‌ థాకరేతో పాటు ఆయన భార్య రష్మీ, కుమారుడు ఆదిత్యకూడా వారితోపాటు పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శనివారం విలేఖరులతో మాట్లాడుతూ ఉద్దవ్‌ థాకరేతోపాటు తమ పార్టీ ఎంపీలు అయోధ్యలో ప్రత్యేక పూజలు చేసేందుకు విచ్చేస్తున్నారని తెలిపారు.మాకు సంబంధించి అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలు కాదన్నారు.ఈ అంశాలు మతానికి , విశ్వాసానికి సంబంధించినవని సంజయ్‌ రౌత్‌ అన్నారు. దేవాలయం పేరు చెప్పుకుని తామెప్పుడూ ఓట్లు కోరలేదన్నారు.ఇకముందు కూడా తాము ఆవిధంగా చేయబోమన్నారు.ఎన్నికల అనంతరం తమ ఎంపీలతో కలిసి అయోధ్యలో పర్యటిస్తామని థాకరే హామీ ఇచ్చారన్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే శివసేన చీఫ్‌ తమ ఎంపీలతో కలిసి అయోధ్యలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి తిరిగి ముంబై చేరుకుంటారని తెలిపారు.కాగా థాకరేతోపాటు శివసేన ఎంపీలను రాష్ట్ర అతిథులుగా పరిగణిస్తామని యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.