(Local) Thu, 24 Sep, 2020

రాష్ట్రపతి భవన్‌ లో చోరీ ...

November 29, 2019,   3:09 PM IST
Share on:
రాష్ట్రపతి భవన్‌ లో చోరీ ...

రాష్ట్రపతి భవన్‌కే కన్నం వేసిన దొంగలను  ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో మంచినీటి సరఫరా కోసం అమర్చడానికి సిద్ధంగా ఉంచిన పైపులు చోరీకి గురయ్యాయి. జోర్ బాగ్ ప్రాంతం నుంచి రాష్ట్రపతి భవన్‌కు మంచినీటి పైప్‌లైన్ వేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌కు చెందిన 23, 24 గేట్ల సమీపంలో ఇందుకోసం పైపులు ఉంచారు. పైపుల చోరీ జరిగిందని సమాచారం అందడంతో పైపులైన్ కాంట్రాక్టు పొందిన అరుణ్ జైన్ చాణక్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి భవన్ గేట్ల వద్ద నుంచి దాదాపు 20-22 పైపులు చోరీ అయినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పైపుల దొంగతనం అక్కడి సిసిటివిలకు చిక్కింది. స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన కొందరు ఒక కంటెయినర్‌లో పైపులను వేసుకుని ఉడాయించినట్లు సిసిటివిలలో రికార్డయింది. దీని ఆధారంగా పోలీసులు ఆజమ్‌గఢ్‌కు చెందిన అజయ్(31) అనే వ్యక్తి అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా బీహార్‌కు చెందిన మిథిలేష్(38), అమేథీకి చెందిన ఊబర్ క్యాబ్ డ్రైవర్ రాకేష్ తివారీ, ఢిల్లీ నివాసి గుడ్డు ఖాన్‌ను వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.