(Local) Wed, 23 Oct, 2019

విజయ్ మాల్యాకు లోన్ ఎందుకు ఇవ్వలేదో తెలిపిన హెచ్‌డిఎఫ్‌సి

July 11, 2019,   2:42 PM IST
Share on:
విజయ్ మాల్యాకు లోన్ ఎందుకు ఇవ్వలేదో  తెలిపిన హెచ్‌ ...

ప్రముఖ జర్నలిస్టు తమల్‌ బంధోప్యాయ రచించిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఎండి, సిఈఓ ఆదిత్య పురి మాట్లాడుతూ.. విజయ మాల్యాపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మనం ఎవరితోనైనా కలిసి కాఫీ తాగవచ్చు… కాని మనం ఏది అనుకుంటామో అదే చేయాలి. వ్యక్తిగత విషయాలను వృత్తిలోకి తీసుకుని రాకూడదు అని గతంలో విజయమాల్యా సిబ్బంది రుణం తీసుకోవడానికి  తన వద్దకు వచ్చారని, ఐతే దరఖాస్తు పరిశీలిస్తానని చెప్పి వారికి కాఫీ ఇచ్చి పంపించేశానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత దరఖాస్తును తన సహచరుడు పరేష్‌కు అందజేశాను. ఆయనకు మాల్యా విషయం అర్థమై..ఆ దరఖాస్తును తిరస్కరించాడు. ఆ తర్వాత మాల్యా ఫోన్‌ చేసిన ప్రతిసారి ఆవేశంగా మాట్లాడేవరని, స్నేహం..బ్యాంకింగ్‌ అనే రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అని అన్నారు. దీంతో అలా పెను ముప్పు నుంచి బయట పడగలిగామని, లేకపోతే ఆయన చుట్టూ తిరిగే గతి పట్టేదని వాపోయారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.