(Local) Fri, 22 Nov, 2019

ఉగ్రవాద శిబిరాలను సమూలంగా ఏరిపారేస్తాం: సత్యపాల్

October 21, 2019,   4:50 PM IST
Share on:
ఉగ్రవాద శిబిరాలను సమూలంగా ఏరిపారేస్తాం: సత్యపాల్

జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శ్రీనగర్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... భారత వ్యతిరేక చర్యలకు మానుకోకుంటే మరిన్ని మెరుపు దాడులు చేస్తామని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను తీవ్రంగా హెచ్చరించారు. అవసరమైతే మరోసారి ‘‘పాక్ భూభాగం లోకి వెళ్లి’’ ఉగ్రవాద శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టేస్తామన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా మెరుపు దాడులు నిర్వహించినట్టు భారత సైన్యం ప్రకటించిన మరుసటి రోజే గవర్నర్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలను సమూలంగా ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.