(Local) Wed, 16 Oct, 2019

ఏపీ సీఎం బాటలో యూపీ సీఎం

October 08, 2019,   10:47 AM IST
Share on:
ఏపీ సీఎం బాటలో యూపీ సీఎం

ఏపీ సీఎం జగన్ అమలు చేసిన పీపీఏల రద్దు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. ఇటీవల ఏపీలో విద్యుత్ సంస్థలతో ఒప్పందం చేసుకున్న పీపీఏలను రద్దు చేస్తే కేంద్ర ఇంధనశాఖ మంత్రి ఆర్కే కూడా తప్పుపట్టారు. తాజాగా ఇటీవల యూపీలో పీపీఏలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నారు.ప్రైవేటు విద్యుత్ సంస్థలతో చేసుకున్న 650 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తూ ఆయన ఆదేశాలిచ్చారు. 2017లో 650 మెగావాట్ల సాంప్రదాయేతర విద్యుత్ కోసం యూనిట్ కు 3.46 రూపాయల చొప్పున యూపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అయితే ఇప్పుడు అంతకంటే తక్కువగా రూ.3.02కే విద్యుత్ అందజేస్తామని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ ముందుకొచ్చింది. దాంతో పీపీఏలకు యోగి ఆధిత్యనాథ్ మంగళం పాడారు. గతంలో సీఎం జగన్ పీపీఏలను రద్దు చేస్తే టీడీపీ, బీజేపీ నేతలు నానా హంగామా చేశారని, ఇప్పుడు సాక్షాత్తూ బీజేపీ ముఖ్యమంత్రే ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు అన్నారు. ఇది టీడీపీ,బీజేపీ నేతలకు చెంపపెట్టులాంటిదని వైసీపీ నేతలు విమర్శించారు. సీఎం జగన్ ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకొని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

సంబంధిత వర్గం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం
నెటిజన్‌కు మిథాలి రాజ్‌ గట్టి సమాధానం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.