(Local) Sun, 08 Dec, 2019

మాజీ సైనికులకు కేంద్ర హోంశాఖ గుడ్ న్యూస్

November 21, 2019,   6:34 PM IST
Share on:
మాజీ సైనికులకు కేంద్ర హోంశాఖ గుడ్ న్యూస్

దేశంలోని మాజీ సైనికులకు కేంద్ర హోంశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ దళాలకు చెందిన మాజీ సైనికులు 1.2లక్షల మందిని కాంట్రాక్టు పద్దతిన నియమించాలని నిర్ణయించింది. ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పడుతుండటంతో ఆయా పరిశ్రమల్లో విధులు నిర్వహించేందుకు సీఐఎస్ఎఫ్ అవసరమవుతోంది. కేంద్ర దళాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జవాన్లను సీఐఎస్ఎఫ్ కాంట్రాక్టు పద్ధతిలో కొత్తగా నియమించాలని నిర్ణయించారు. సీఐఎస్ఎఫ్ దళానికి అదనంగా ఉద్యోగులు కావాలన్న ప్రతిపాదనలను ఆ సంస్థ ఐజీ.. కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పంపించారు. మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.