(Local) Wed, 28 Oct, 2020

ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి

November 30, 2019,   12:48 PM IST
Share on:
ఇక నుంచి ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా పని చెయ్యాలి

బస్సు భవన్‌లోని అధికారిక కార్మిక సంఘమైన TMU కార్యలయానికి యాజమాన్యం తాళం వేశారు. ఆర్టీసి కార్మిక నేతలు కూడా ఇప్పటి నుంచి సాధారణ కార్మికుల మాదిరిగానే విధులు నిర్వహించాల్సిందేనని తెలిపారు. ఇప్పటివరకూ వారికి కల్పించిన రిలీఫ్‌ (విధులు నుంచి మినహాయింపు) హక్కులను యాజమాన్యం రద్దు చేసింది. దీని ప్రకారం ఆర్టీసి కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితో సహా యునియన్‌ నేతలంతా డ్యూటీలు చేయాలి. ఇతర కార్మికుల మాదిరిగానే వారందరు విధులకు హాజరు కావాలి లేకుంటే గైర్హాజరుగా పరిగణిస్తారు. మొత్తం 30 మంది కార్మిక నేతలకు ఇప్పటి వరకు డ్యూటీ మినహాయింపు ఉండేది. ఇందులో అధికారిక కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (TMU)కు చెందిన వారు 26 మంది ఉన్నారు. ఇంకా కార్మికుల నుంచి యూనియన్‌ సభ్యత్వ రుసుమును వసూలు చేసే విధానానికి కూడా త్వరలో చెక్‌ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసి యూనియన్లు ఉండకూడదని అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...
గిరిజన ప్రాంతాలలో ఏకలవ్య స్కూళ్లు - రేణుకా సింగ్ స ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.