(Local) Fri, 22 Nov, 2019

టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బావుంటుంది: సి. రామచంద్రయ్య

October 17, 2019,   1:50 PM IST
Share on:
టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బావుంటుంది: సి. రా ...

గతంలో చేసిన అవినీతి, కుంభకోణం బయట పడుతుందనే భయంతోనే ప్రధాని మోడీ అంటే ద్వేషం లేదంటూ చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేత సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వం కోసమే బినామీలను బీజేపీలోకి పంపించారని ఆరోపించారు. దీనికంటే టీడీపీని బీజేపీలో విలీనం చేస్తే బావుంటుందని సూచించారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు. పెట్టుబడి సాయంగా రైతు భరోసా డబ్బులు నేరుగా ఖాతాల్లోకి వేయడంతో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన చంద్రబాబుకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.

సంబంధిత వర్గం
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...
స్వార్థం, అవివేకంతో జగన్ రాష్ట్రానికి కీడు చేస్తున ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.