(Local) Tue, 14 Jul, 2020

టర్కీ ప్రత్యేక ఆపరేషన్‌ పై సిరియా ప్రజలు భయపడుతున్నారు :చైనా

October 16, 2019,   4:05 PM IST
Share on:
టర్కీ ప్రత్యేక ఆపరేషన్‌ పై సిరియా  ప్రజలు భయపడుతున ...

సిరియా సరిహద్దులో సైనిక చర్యలను ఆపేయాలని చైనా టర్కీని కోరింది. కుర్దు తిరుగుబాటుదారుల ఏరివేత లక్ష్యంగా టర్కీ బలగాలు చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్‌ హింసాత్మకంగా మారడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీ సైన్యం కాల్పుల్లో అమాయక ప్రజలు మృతిచెందుతున్నారని పేర్కొంది. ఉత్తర సిరియా సరిహద్దులో కాల్పుల విరమణ పాటించాలని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. ఉత్తర సిరియాలో టర్కీ బలగాలు చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్‌ కారణంగా అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, హక్కుల ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకుంటున్నా యని పేర్కొంది.

సిరియన్లు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లలేని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. టర్కీ చర్యల కారణంగా సిరియన్ల సార్వభౌమత్వం దెబ్బతిన్నదని, సిరియన్లలో అభద్రతా భావం నెలకొందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. టర్కీ బలగాలు తక్షణమే సిరియా సరిహద్దు నుంచి వైదొలగాలని షువాంగ్‌ కోరారు. కాగా, తమ లక్ష్యం నెరవేరేంత వరకు సిరియాలో ప్రత్యేక ఆపరేషన్‌ను నిలిపివేసే ప్రసక్తి లేదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ప్రకటించారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.