(Local) Mon, 06 Apr, 2020

ఏపీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు

November 11, 2019,   4:06 PM IST
Share on:
ఏపీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడలో ఏ ప్లస్ కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అబ్దుల్ కలాం విద్యా పురస్కారాల ప్రధానోత్సవం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ … “ఏపీలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతామంటే కొంత మంది రాద్దాంతం చేస్తున్నారు. విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్బంగా నేను అడుగుతున్నా.. చంద్రబాబు కొడుకు ఏ మీడియం చదివాడు. అతని మనవడు ఏం చదవబోతున్నాడు.? వెంకయ్య నాయుడి పిల్లలు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా? సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు. ముగ్గురి భార్యల పిల్లలు ఐదుగురు వరకు ఉన్నట్టున్నారు. వారు ఏం చదువుతున్నారు.?  

మేం ప్రపంచ స్థాయి కోసం ఇంగ్లీషు మీడియం తెస్తుంటే కొన్ని పత్రికలు, వెంకయ్యనాయుడు, చంద్రబాబు, పవన్ విమర్శలు చేస్తున్నారు. తాము చేయరు. చేసేటోళ్లను చేయనియ్యరు. పేద పిల్లలు ఇంగ్లీషు మీడియం చదవడం ఇష్టం లేదా. ముందుగా 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం తీసుకొస్తాం. ఆ తర్వాత 7 నుంచి పదో తరగతికి అమలు చేస్తాం. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తాం.” అని ఆయన ఘాటుగా  వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.