(Local) Tue, 17 Sep, 2019

కాంగ్రెస్ మునిగిపోతున్న నావ - దత్తాత్రేయ

August 19, 2019,   11:51 AM IST
Views: 64
Share on:
కాంగ్రెస్ మునిగిపోతున్న నావ - దత్తాత్రేయ

కాంగ్రెస్ పార్టీ మునిగి పోతున్న నావ అని బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు.  త్రివిధ దళాలకు ఒకే చీఫ్ ను నియమించుకోవాలనుకోవడం కొత్త అధ్యాయమని దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హాజరయ్యారు. టీడీపీ నుంచి భారీగా బీజేపీలో చేరికలు జరిగాయి.రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ గరికపాటి మోహన్ రావు అన్నారు. కొంతమంది నాయకుల వైఖరి వల్లే టీడీపీ నుంచి బీజేపీలో చేరానన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వంలో పనిచేసేందుకే బీజేపీలో చేరానని గరికపాటి అన్నారు.

సంబంధిత వర్గం
వాల్మీకి చిత్రానికి బీజేపీ అధ్యక్షుడి వార్నింగ్...
వాల్మీకి చిత్రానికి బీజేపీ అధ్యక్షుడి వార్నింగ్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.