(Local) Tue, 14 Jul, 2020

దేశభక్తిపై ధ్రువీకరణ పత్రం అవసరం లేదు: మాజీ ప్రధాని

October 18, 2019,   3:37 PM IST
Share on:
దేశభక్తిపై ధ్రువీకరణ పత్రం అవసరం లేదు: మాజీ ప్రధాన ...

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ గురువారం జరిగిన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్టికల్‌ 370 నిర్వీర్యానికి సంబంధించి కాంగ్రెస్‌ దేశభక్తిపై ఎవరి నుంచీ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని అన్నారు. ఆర్టికల్‌ 370 నిర్వీర్యానికి సంబంధించి పార్లమెంటులో కాంగ్రెస్‌ అనుకూలంగా ఓటు వేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే, దాని అమలు తీరులో బీజేపీ అహంకార పూరిత ధోరణికి తాము వ్యతిరేకమని చెప్పారు. ఆర్టికల్‌ 370 తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని కాంగ్రెస్‌ భావిస్తుందని, కానీ దాంట్లో మార్పులు చేయాలంటే అది జమ్మూకశ్మీర్‌ ప్రజల సమ్మతితోనే చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎన్నికల ముందు ఎన్సీపీ నేతలు శరద్‌పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌ను ఈడీ పలు కేసుల్లో విచారించడంపైనా ఆయన స్పందించారు. ఎన్డీయే హయాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు మరిన్ని అధికారాలు వచ్చాయని ఆ అధికారాలను రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించకూడదన్నారు.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.