(Local) Mon, 06 Apr, 2020

వైసీపీలో చేరిన దేవినేని అవినాష్

November 15, 2019,   11:26 AM IST
Share on:
వైసీపీలో చేరిన దేవినేని అవినాష్

టీడీపీ రాష్ట్ర యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో దేవినేని అవినాష్, టీడీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రెండు గంటల క్రితమే టీడీపీ కార్యాలయానికి అవినాష్ రాజీనామా లేఖ పంపిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అవినాష్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...  

"జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరుతున్నాను. ఆయన అడుగుజాడల్లోనే పార్టీలో నడుస్తాను. త్వరలోనే నెహ్రు అభిమానులు కూడా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. వచ్చేసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేందుకు సైనికుడిలా పని చేస్తాను. మా వర్గం కార్యకర్తలకు నాయకులకు పార్టీలో అన్యాయం జరిగింది. ఎన్నిసార్లు చంద్రబాబునాయుడు దృష్టికి లొకేష్ దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు పట్టించుకోలేదు. మా అభిమానులు కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మారను. పదవుల కోసం కాకుండా పార్టీకోసం పని చేస్తానన్నారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాను." అని అవినాష్ అన్నారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.