(Local) Mon, 20 Sep, 2021

చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడులు

September 14, 2019,   12:10 PM IST
Share on:
చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడులు

ప్రపంచంలోని అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడులు జరిగి భారీ మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుజామున తూర్పు సౌదీ అరేబియాలోని బుఖ్యాఖ్ వద్ద ఉన్న చమురు శుద్ధి కర్మాగారంలో భారీ ఎత్తున మంటలు చెలరేగినట్లు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మంటల కారణంగా ఆకాశంలో దట్టమైన పొగ ఏర్పడిందని, మంటలు చెలరేగినపుడు కాల్పుల శబ్దం వినిపించిందని అక్కడి వార్తాసంస్థలు తెలిపాయి.ఆరాంకో కంపెనీకి చెందిన ఈ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడులు జరిగినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించినప్పటికీ దాడికి బాధ్యులెవరో మాత్రం వెల్లడించలేదు. ఈ ప్లాంటులో రోజుకు దాదాపు 70 లక్షల బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేయగల సామర్ధం ఉంది. సౌదీ రాజధాని రియాధ్‌కు 330 కిలోమీటర్ల దూరంలో బుఖ్యాఖ్ ఉంది.

సంబంధిత వర్గం
పేదరికం గురించి చదవలేదు -స్వయంగా అనుభవించాను
పేదరికం గురించి చదవలేదు -స్వయంగా అనుభవించాను
సౌదీ అరేబియా రాజు కుమార్తెకి జైలు శిక్ష
సౌదీ అరేబియా రాజు కుమార్తెకి జైలు శిక్ష

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.