(Local) Sun, 08 Dec, 2019

ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ సీఎం?

November 21, 2019,   6:46 PM IST
Share on:
ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ సీఎం?

ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించనున్నారని తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి పేరును కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఉమెన్ చాందీ ప్రతిపాదించారు. దీనికి సమ్మతించిన సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని ఆదేశించారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు.  గత కొద్ది కాలం క్రితమే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రతిపాదనకు వచ్చినా అది అమలు కాలేదు. చర్చల అనంతరం అధికారికంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.