(Local) Fri, 06 Dec, 2019

టీడీపీ అధినేతపై విమర్శలు చేయించడాన్ని ఖండించిన మాజీ ఎమ్మెల్యే

November 17, 2019,   11:49 AM IST
Share on:
టీడీపీ అధినేతపై విమర్శలు చేయించడాన్ని ఖండించిన మాజ ...

టీడీపీ జిల్లాపార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ... భవన నిర్మాణ రంగ కార్మికుల పక్షాన పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇసుక దీక్షను పక్కదారి పట్టించేందుకు తమ పార్టీకి చెందిన వల్లభనేని వంశీమోహన్ , గుడివాడ అభ్యర్థిగా పోటీచేసిన దేవినేని అవినాష్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీలోకి చేర్చుకుని తెలుగుదేశం పార్టీ అధినేతపై విమర్శలు చేయించడాన్ని ఖండించారు.తమ వ్యక్తిగత అభిప్రాయాలతో , తమ స్వలాభాలతో పార్టీని వీడి అధికార పార్టీలో చేరి . . మిమ్ములను గౌరవించిన తెలుగుదేశం పార్టీ , పార్టీ అధినేతను విమర్శించే నైతిక స్థాయి తమకు లేవని మండిపడ్డారు . వంశీని విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఒకసారి అవకాశం కల్పించామని రెండు సార్లు శాసనసభకు తెలుగుదేశం పార్టీ తరపున అవకాశం కల్పిస్తే ఈరోజున ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు విఫలమయ్యారని వంశీ అనటం హాస్యాస్పదమన్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్రలో వీరు పావులుగా మారారని రాబోయే రోజుల్లో దీన్ని తమరు ప్రత్యక్షంగా అనుభవిస్తారని విమర్సలు గుప్పించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నా , ప్రతిపక్షంలో వున్నా 37 సంవత్సరాలుగా ప్రజల అభ్యున్నతికై , అభివృద్ధిపై . . వారి పక్షాన నిలబడే పార్టీ అన్నారు. వల్లభనేని వంశీ , అవినాష్ లాంటి వాళ్లు వెళ్లిపోతే వందల మంది నాయకులను తయారుచేసే సత్తా తెలుగుదేశం పార్టీదని , తెలుగుదేశం పార్టీ నాయకులను తయారుచేసే కర్మాగారమని వెల్లడించారు. వాళ్లు వెళ్లిపోవటం వలన కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి నష్టం లేదని ధీటైన నాయకత్వంతో పార్టీ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.