(Local) Mon, 12 Apr, 2021

సౌదీ అరేబియా రాజు కుమార్తెకి జైలు శిక్ష

September 13, 2019,   2:47 PM IST
Share on:
సౌదీ అరేబియా రాజు కుమార్తెకి జైలు శిక్ష

సౌదీ అరేబియా రాజు కుమార్తె ప్లంబర్‌ను దారుణంగా కొట్టడంతో పాటు కిడ్నాప్ చేసిన నేరానికి  ఫ్రెంచ్ కోర్టు 10 నెలల కారాగార శిక్ష విధించింది. అయితే కోర్టు ఈ శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేసింది. యువరాణి హస్సా బింట్ సల్మాన్ తరఫున కోర్టుకు హాజరైన ఫ్రెంచ్ న్యాయవాది మాత్రం ప్లంబర్ అష్రఫ్ ఈద్ తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడని, ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలుకు వెళతామని గురువారం చెప్పారు.

యువరాణికి చెందిన ఫ్లాట్‌లో పనిచేస్తుండగా తాను ఆమెను సెల్‌ఫోన్‌లో ఫోటో తీశానన్న ఆరోపణతో ఆమె బాడీగార్డు తన చేతులు కట్టేసి దారుణంగా కొట్టాడని, బలవంతంగా యువరాణి పాదాలకు ముద్దు పెట్టించాడని కోర్టులో తెలిపాడు. తన సెల్‌ఫోన్‌ను లాక్కున్నారని, బాడీగార్డు కొడుతున్నంతసేపు ఎదురుగా కూర్చున్న యువరాణి తనను కుక్కలా పరిగణిస్తూ రాజకుటుంబంతో ఎలా మాట్లాడాలో నీకు నేర్పస్తామంటూ బెదిరించిందని బాధితుడు కోర్టుకు తెలిపాడు. 43 ఏళ్ల యువరాణి సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు సోదరి. తాను ఎటువంటి తప్పు చేయలేదని ఆమె తన న్యాయవాదుల ద్వారా వాదించింది. అయితే, ఈ తీర్పుతో పారిస్, రియాధ్ మధ్య సంబంధాలు ఏ విధంగా మారతాయోనన్న ఆసక్తి నెలకొంది.

సంబంధిత వర్గం
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు  మరో అరుదైన గౌరవం
ఫ్రెంచ్ దేశంలో ఐశ్వర్యారాయ్ కు మరో అరుదైన గౌరవం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.