(Local) Mon, 06 Apr, 2020

కార్మికులు చనిపోడానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి ..?

November 27, 2019,   3:03 PM IST
Share on:
కార్మికులు చనిపోడానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి . ...

ఆర్టీసి సమ్మె నేపథ్యంలో ఎందరో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా దీనిపై కార్మికులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వం కారణంగానే ఆర్టీసి కార్మికులు చనిపోయారని అనడానికి ఆధారాలేంటి? అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసి కార్మికులను విధుల నుంచి డిస్మిస్‌ చేసినట్లు ప్రభుత్వం  ప్రకటించలేదు కదా అని ధర్మాసనం పేర్కొంది. కార్మికులకు గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా ప్రభుత్వ తీరు వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు పలు సూసైడ్‌ నోట్లను పిటిషనర్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. అయితే సమ్మెకు పిలుపునిచ్చింది యూనియన్లు కదా కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఏవిధంగా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి తాము ఏ విధమైన ఆదేశాలను ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. పిటిషనర్‌ మాట్లాడుతూ.. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళ్లిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారని తెలుపగా, కార్మికులను డిపోల్లోకి అనుమతించకపోతే మరో అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. కాగా ఆ అంశంపై మరో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని పిటిషనర్‌ తెలిపారు.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.