(Local) Fri, 06 Dec, 2019

చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బోబ్డే

November 17, 2019,   12:02 PM IST
Share on:
చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బోబ్డే

మహారాష్ట్రకు చెందిన జస్టిస్‌ శరద్‌ అర్వింద్‌ బోబ్డే (63) చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ స్థానంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా నవంబర్ 18న బాధ్యతలు చేపట్టనున్నారు. 19 ఏండ్ల క్రితం అదనపు న్యాయమూర్తిగా బాంబే హైకోర్టులో చేరిన జస్టిస్‌ బోబ్డే.. ఆ తర్వాత రెండేండ్లకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013 ఏప్రిల్‌ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దేశంలో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌ బోబ్డే పదవీకాలం 18 నెలల్లో ముగియనున్నది.  జస్టిస్‌ బోబ్డే తన కెరీర్‌లో విచారణ జరిపిన కీలక కేసుల్లో అయోధ్య కేసుతోపాటు ఆధార్‌ ఆర్డినెన్స్‌ కేసు, పౌరుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కేసు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూస్‌) రిజర్వేషన్‌ కేసు,ఆర్టికల్‌ 370 కేసు ముఖ్యమైనవి.

సంబంధిత వర్గం
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.