(Local) Sat, 23 Oct, 2021

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం ప్రారంభం

November 27, 2019,   11:47 AM IST
Share on:
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం ప్రారంభం

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సభ్యులచే ప్రొటెం స్పీకర్ కాళిదాసు ప్రొబెంకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. నేడు సాయంత్రం వరకు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఫడ్నవీస్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం ఆదేశాలతో సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా చేశారు. డిప్యూటి సీఎం పదవికి అజిత్ పవార్ కూడా రాజీనామా చేశారు. దీంతో శివసేన,ఎన్సీపి,కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నేడు సాయంత్రం బలనిరూపణ తర్వాత ఉద్ధవ్ ఠాక్రేను సీఎంగా సభ్యులు ఎన్నుకోనున్నారు. ఉద్దవ్ రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ లు డిప్యూటీ సీఎం పదవులు తీసుకోనున్నాయి.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.