(Local) Mon, 06 Apr, 2020

ప్రధానితో ముగిసిన పవార్‌ భేటీ...

November 20, 2019,   4:06 PM IST
Share on:
ప్రధానితో ముగిసిన పవార్‌ భేటీ...

ప్రధాని నరేంద్ర మోడీతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నేడు అంబటి అయిన సంగతి తెలిసిందే. అయితే వీరి భేటీ  మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా తాము మహారాష్ట్ర రాజకీయాలపై ఈ సమావేశంలో చర్చించలేదని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తాను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని పవార్‌ తెలిపారు. మహారాష్ట్రలోని రైతుల సమస్యలపై మోడికి ఆయన వినతి పత్రం అందజేశారు. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని రెండు జిల్లాల రైతులు పూర్తిగా నష్టపోయారన్నారని, పెద్ద మొత్తంలో పంట దెబ్బతిందని చెప్పారు. మరాట్వాడా, విదర్భల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం అంతా తన వద్ద ఉన్నట్లు పవార్ తెలిపారు. మోడితో పవార్ మహారాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించినట్లు సమాచారం. అలాగే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కూడా ఆయన ప్రస్తావించారు. మహరాష్ట్రలోని పరిస్థితులపై చొరవ తీసుకుని చక్కదిద్దాలని కోరినట్లు సమాచారం. కాగా, ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ కూడా పాల్గొనడం గమనార్హం.

సంబంధిత వర్గం
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే
విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఉద్ధవ్ ఠాక్రే

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.